షాకింగ్‌ లుక్‌లో భళ్లాలదేవ!

By iQlikMovies - May 14, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడిగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న హీరో దగ్గుబాటి రానా. హీరోగానే కాకుండా, కథ, క్యారెక్టర్‌ నచ్చితే నిడివి గురించి కూడా ఆలోచించడీ యంగ్‌హీరో. అందుకే రానా నుండి ఎలాంటి ఛేంజ్‌ ఓవర్‌నైనా ఊహించవచ్చు. తాజాగా రానాకి సంబంధించి కొన్ని షాకింగ్‌ ఫోటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలోల రానా ఎలా ఉన్నాడో తెలుసా.? పొడుగాటి గెడ్డం, అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కూడా ఉన్నాయి. ఉంగరాల జుట్టు, నల్ల కళ్లజోడు ధరించి ఉన్నాడు. మాసిపోయినట్లుగా ఉన్న బ్రౌన్‌ కలర్‌ లూజ్‌ షర్టు ధరించి ఉన్నాడు.

 

ఈ లుక్‌లో రానాని చూసి అంతా షాకవుతున్నారు. 'బాహుబలి'లో భళ్లాలదేవగా కండలు తిరిగిన దేహంతో కనిపించిన రానా, ఈ స్టిల్‌లో బక్క పలచని దేహంతో కనిపిస్తున్నాడు. ఈ మధ్య రానా ఎక్కడ కనిపించినా, రకరకాల అనుమానాలు రైజ్‌ చేస్తున్నారు. ఆ అనుమానాలన్నీ ఈ గెటప్‌ చూశాక పటాపంచలైపోయాయి. రానా ప్రస్తుతం 'హాథీ మేరే సాథీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా కోసమే ఈ న్యూ లుక్‌ అని తెలుస్తోంది.

 

గతంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఫోటోలో రానా ఇలాగే కనిపించాడు. సో రానా లుక్స్‌పై అనుమానాలన్నీ జీరో. ఓ ఏనుగుకూ, రానాకీ మధ్య సంబంధం కాన్సెప్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రభు సాలమన్‌ ఈ సినిమాకి దర్శకుడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. వీటితో పాటు, 'విరాటపర్వం' తదితర చిత్రాల్లోనూ రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS