కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఇంటి పై ఐ.టీ అధికారులు సోదా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రష్మిక పై ఐ.టీ రైడ్ అనే వార్త వైరల్ అయిన నేపధ్యం లో రష్మిక మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. రైడ్ అయిన వార్త వాస్తవమే కానీ అది రష్మిక పై కాదట తన తండ్రి మదన్ వ్యాపార సంస్థల ను మరియు రష్మిక ఇంటి ని సోదా చేశారట.
ఇప్పటికే రష్మిక తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిందనే వార్త ఇండస్ట్రీ లో చెక్కర్లు కొట్టింది.. దానిని ఖండించిన రష్మిక తాను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నట్టూ, ఇండస్ట్రీ తనకు కొత్త అని వెల్లడించింది. రష్మిక తాజా చిత్రం సూపర్ స్టార్ మహేష్ 'సరిలేరు నీకెవ్వరూ' బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుకుపోతుంది.
ALSO SEE :
Rashmika Mandanna Latest Photoshoot