ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా విన్నా మనకు ఎక్కువగా కనిపిస్తున్న & వినిపిస్తున్న మాట “ఐటి దాడులు”. ప్రముఖ రాజకీయ నాయకుల పైన, సెలబ్రిటీల పైన ఈ మధ్య తరచుగా ఐటి దాడులు జరుగుతున్నాయి.
ఇక తాజాగా ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి ఇంటి పైన అలాగే అతని కార్యాలయం పైన కూడా ఐటి దాడులు జరిగాయి. ఏకకాలంలో రెండు చోట్ల కూడా ఐటి దాడులు జరగడంతో ఒక్కసారిగా కోలీవుడ్ ఉలిక్కిపడిందనే చెప్పాలి.
అయితే ఈ ఐటి దాడుల వివరాలని ఇటు విజయ్ సన్నిహితులు కాని అటు ఐటి డిపార్టుమెంటు వారు కాని బయటకి తెలియనివ్వడం లేదు. ఇక ఈ దాడులు జరిగే సమయంలో విజయ్ సేతుపతి షూటింగ్ నిమిత్తం వేరే ఊరిలో ఉన్నారని సమాచారం.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన నవాబ్ మొన్ననే విడుదలకాగా ఆయన హీరోగా చేసిన చిత్రం వచ్చే వారం విడుదలకానుంది.