కౌశల్‌ ఆర్మీకి కంటి మీద కునుకు లేదంతే

మరిన్ని వార్తలు

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ టూ కనీ వినీ ఎరుగని స్థాయిలో 'హైలైట్‌' అవుతూ వస్తోందంటే, దానికి కారణం ఖచ్చితంగా కౌశల్‌ ఆర్మీనే.

సోషల్‌ మీడియా వేదికగా కౌశల్‌ అభిమానులు, 'కౌశల్‌ ఆర్మీ'గా ఏర్పడి హల్‌చల్‌ చేస్తున్నారు. ఆ ఆర్మీలో కొందరు హద్దులు దాటి ఇతర కంటెస్టెంట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమూ జరుగుతోంది. అయితే ఓవరాల్‌గా కౌశల్‌ కోసం పుట్టిన ఈ ఆర్మీ, అతన్ని ప్రతిసారీ ఎలిమినేషన్‌ నుంచి తప్పిస్తూనే వచ్చింది. తద్వారా పెద్దగా పేరులోని కౌశల్‌ అనే వ్యక్తిని, బిగ్‌ బాస్‌ రియాల్టీ షోకి 'హీరోని' చేసేసింది. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు, రేపు ఫలితం తేలే మధ్యలో ఏం మ్యాజిక్‌ జరుగుతుందో గానీ ఇప్పటికైతే కౌశల్‌ గెలవడం ఖాయమన్న అంచనాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.  అలాగే సామ్రాట్‌, గీత, దీప్తి, తనీష్‌లకూ సైలెంట్‌ ఓటింగ్‌ గట్టిగానే జరుగుతోంది. 

ఇదిలా వుంటే, గత రెండ్రోజులుగా కౌశల్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో రాత్రీ పగలూ అన్న తేడాల్లేకుండా తమ అభిమాన కంటెస్టెంట్‌కి మద్దతు పలుకడం జరుగుతోంది. ఇంటర్నెట్‌ ద్వారా, ఫోన్‌ ద్వారా ఓటింగ్‌ చేసే అవకాశం వుండడంతే ఏ క్షణం కూడా వాళ్ళు ఖాళీగా కన్పించడంలేదు. నిన్న యూఏఈలో భారత్‌ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగితే, ఆ మ్యాచ్‌లోనూ కౌశల్‌ ఆర్మీ సందడి చేసింది. ఓ సూపర్‌ హిట్‌ సినిమాలో నటించినా కౌశల్‌కి ఇంత ఫాలోయింగ్‌ వచ్చేది కాదేమో. 

ఈ ఫాలోయింగ్‌ కౌశల్‌ని గెలిపిస్తుందా? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS