కొత్త రత్తాలు కోసం ఆచార్య టీమ్ వేట

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగులు జరగడం లేదు కాబట్టి బ్రేక్ ఇచ్చారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగును తిరిగి ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ఈమధ్యే ఓ అప్డేట్ వచ్చింది.

 

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈమధ్య ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ 'ఆచార్య' సినిమాలో 5 పాటలు ఉంటాయని తెలిపారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందని వెల్లడించారు. మెగాస్టార్ సినిమాలలో పాటలకు, డ్యాన్సులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక మాస్ ప్రేక్షకుల కోసం ఓ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తారు. అలాగే ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ పాటకు ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారట. హీరోయిన్ కోసం ఇప్పటికే వెతుకులాట మొదలైందని సమాచారం.

 

మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా 'ఖైది నెం.1' సినిమాలో 'రత్తాలు రత్తాలు' స్టైల్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. చిరు లాస్ట్ సినిమా 'సైరా' ఓ చారిత్రక చిత్రం కావడంతో స్పెషల్ సాంగ్స్ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ లోటును ఈ సినిమా ద్వారా తీర్చాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS