ప‌వ‌న్‌కి మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వుదామ‌నుకుంటున్నాడా?

By Gowthami - July 14, 2020 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - అలీ. ఇద్ద‌రూ మంచి స్నేహితులు. అలీ లేకుండా నేను సినిమాలు చేయ‌లేను - అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి హీరో అన్నాడంటే, అలీ అంటే ప‌వ‌న్‌కి ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. అయితే... గ‌త ఎన్ని క‌ల స‌మ‌యంలో ఇద్ద‌రూ ఎడ‌మొహం - పెడ మొహంలా ఉన్నారు. అలీ - ప‌వ‌న్ మ‌ధ్య చాలా గ్యాప్ వ‌చ్చింది. ఇద్ద‌రూ త‌లో మాటా అనేసుకున్నారు. దాంతో...ప‌వ‌న్ ఫ్యాన్స్ అలీపై గుర్ర‌గానే ఉన్నారు. వాళ్ల‌ని అలీ ఇప్పుడు శాంత ప‌రిచే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాడేమో అనిపిస్తోంది.

 

” వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు…ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు…” అంటూ ప‌వ‌న్ ని ఉద్దేశిస్తూ అలీ సోష‌ల్ మీడియాలో ఓ కామెంట్ పెట్టాడు. నిజానికి ఈ కామెంట్ ప‌ట్ల ప‌వ‌న్ అభిమానులు సానుకూలంగా స్పందించాలి. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. `గ‌త ఎన్నిక‌ల్లో మా అన్న‌కు ఎందుకు దూరంగా ఉన్నావ్‌` అంటూ ప‌వ‌న్ అభిమానుల నుంచి రివ‌ర్స్ కామెంట్లు మొద‌ల‌య్యాయి. అలా మాట్లాడిన వాళ్ల‌లో మీరు కూడా ఉన్నారు క‌దా.. అంటూ కొంత‌మంది ప‌వ‌న్ అభిమానులు బాహాటంగానే అలీని ప్ర‌శ్నిస్తున్నారు. కాక‌పోతే... అలీ - ప‌వ‌న్ ల మైత్రీ బంధానికి ఇదో పాజిటీవ్ సైన్ అనుకోవాలి. స్నేహం ఎప్పుడూ గొప్ప‌దే. అదెప్పుడు, ఎలా చిగురించినా స్వాగ‌తించాలి. ప‌వ‌న్ అభిమానులు ఈ విష‌యాన్ని అర్థం చేసుకొంటే మంచిది. మ‌రి ప‌వ‌న్ అలీకి ఎలాంటి రిప్లై ఇస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS