గత వారం విడుదలైన సినిమా `జానూ`. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మాత. తమిళంలో క్లాసిక్గా నిలిచిన `96`కి ఇది రీమేక్. విడుదల రోజున ఈ సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. అయితే సినిమా బాగా స్లో అయ్యిందన్న కామెంట్లు వినిపించాయి. బీ, సీ ప్రేక్షకులకు ఈ సినిమా చేరువవుతుందా, అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాలే నిజం అయ్యాయి. ఈసినిమా బీ, సీల్లో ఏమాత్రం నిలబడ లేదు. దాంతో... వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి.
సోమవారం 30 శాతం టికెట్లుకూడా తెగలదు. ఇప్పటి వరకూ ఈ సినిమాకి 9 కోట్ల వసూళ్లు వచ్చాయి. కీలకమైన ప్రాంతాలలో దిల్ రాజు స్వయంగా ఈసినిమాని విడుదల చేశారు. మరికొన్ని చోట్ల.... తమ సంస్థకు అలవాటైన బయ్యర్లకు ఈ సినిమా అమ్మారు. వాళ్లు మంచి రేట్లు పెట్టే ఈసినిమా కొన్నారు. కానీ.. ఇప్పుడు వాళ్లందరికీ నష్టాలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.