తెలుగు చిత్రసీమ సమస్యలపై, అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. వరాల జల్లు కురిపించింది. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో జరిగిన సమావేశంలో చిరంజీవి, నాగార్జునలతో పాటు అధికారులతో భేటీ వేసిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
శంషాబాద్ పరిసర ప్రాంతాలలో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. సినిమా, టీవీ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చారు. అందుకోసం స్థలాన్ని సేకరించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. పైరసీని అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, కళాకారుల ఆరోగ్య భీమపై దృష్టిసారిస్తామని, టికెట్ వ్యవస్థ మొత్తం ఆన్‌లైన్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని చిత్రసీమపై వరాల జల్లు కురిపించారు.
ఇందుకు సంబంధించి టాలీవుడ్ ప్రముఖులతోనూ, ప్రభుత్వ అధికారులతోనూ మరో దఫా చర్చలు జరుపుతామన్నారు.