డబ్బింగ్ చెప్తున్న టాలీవుడ్ ఏజెంట్!

By Inkmantra - June 16, 2020 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే విజయం సాధించడంతో పాటుగా నటనకు ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నవీన్ నటించే సినిమా గురించి పెద్దగా ఆప్దేట్లు ఏవీ రాలేదు. తన కొత్త సినిమా గురించి తాజాగా నవీన్ ఓ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం నవీన్ 'జాతి రత్నాలు' అనే కామెడీ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు కెవీ అనుదీప్ కాగా నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. 'జాతి రత్నాలు' సినిమాకు డబ్బింగ్ పనులు సాగుతున్నాయని, తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్తున్నానని వెల్లడించాడు.

 

ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారట. ఇదిలా ఉంటే మరో విషయంలో కూడా నవీన్ క్లారిటీ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నవీన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని ఈమధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పందిస్తూ అవన్నీ గాసిప్పులేనని ఆ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS