రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌ చ‌లాకీ చంటి!

By iQlikMovies - June 18, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో గాయాల ప‌రంప‌ర కొనసాగుతూనే ఉంది. ప్ర‌తీ రోజూ ఏదో ఓ వార్త వినాల్సివ‌స్తోంది. తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన చ‌లాకీ చంటి కూడా గాయ‌ప‌డ్డాడు. సూర్యాపేట‌లోని కోదాడ ద‌గ్గ‌ర జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో చంటి స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడు. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ కారులో వ‌స్తున్న చంటి.. రోడ్డు పక్క‌నే ఆగివున్న లారీని ఢీ కొన‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

 

Chalaki Chanti

చంటి స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. వెంట‌నే ఆయ‌న్ని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇటీవ‌లే యువ‌హీరోలు శ‌ర్వానంద్‌, వ‌రుణ్ తేజ్‌, సందీప్ కిష‌న్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. శ‌ర్వాకి అయితే పెద్ద ఆప‌రేష‌నే జ‌రిగింది. మిగిలిన వాళ్లు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఏదేమైనా సినిమావాళ్లు కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిదేమో..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS