పోల్ డాన్స్‌లో ధిట్ట ముద్దుగుమ్మ జాక్వెలైన్ ఫెర్నాండెజ్. హాట్ హాట్‌గా పోల్ చుట్టూ రౌండ్స్ వేస్తూ చిందేయడమే కాదు, పోల్ తో యోగాసనాలు కూడా వేసేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈ ఫోటోలో చూడండి కాళ్లతో పోల్‌ని చుట్టి, చేతులు రెండూ వదిలేసి, మొత్తం బాడీని బ్యాలెన్స్ చేసేసింది. ఇలా చేయడం ఈ ముద్దుగుమ్మకే సాధ్య అంటే ఒప్పుకొని తీరాల్సిందే. ఈ మధ్య 'జుడ్వా - 2' సినిమాతో ప్రేక్షకు ముందుకొచ్చింది. ఈ సినిమాలో అమ్మడి హాట్‌నెస్‌కి ఆకాశమే హద్దు. బికినీలతో ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. సినిమా దారి సినిమాదే. ఇక సోషల్ మీడియాలో హాట్నెస్ చెప్పనే అక్కర్లేదు. యోగాసనాల పేరిట అమ్మడు ప్రదర్శించే హాట్ అప్పీల్ అంతా ఇంతా కాదు. ఇదిగో ఈ తాజా ఫోటోలో అమ్మడు యోగ ముద్ర వేసినట్లే ఉంది. అయితే మామూలుగా యోగముద్ర అందరూ వేయగలరు. ఇలా పోల్ మీద బ్యాలెన్స్ చేసి వేయగలరా? అయితే ఈ బ్యూటీని చూసి ఆస్వాదించాల్సిందే.