స్పెషల్ సాంగ్స్‌లో నర్తించేందుకు రెమ్యునరేషన్ కూడా స్పెషల్‌గానే ఆఫర్ చేస్తుంటారు మన దర్శక నిర్మాతలు. అందులోనూ ఓ మోస్తరు స్టార్డమ్ ఉన్న హీరోయిన్స్‌ని తీసుకుంటేనే ఓ రేంజ్లో రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ విషయంలో రెమ్యునరేషన్ ఖచ్చితంగా మ్యాటరే అవుతుంది.
భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న 'సాహో'లో హీరోయిన్ శ్రద్ధాకపూర్ సహా, బాలీవుడ్ నుండి పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ముఖ్యంగా స్పెషల్ సాంగ్‌లో నర్తించిన శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ది ఓ స్పెషల్. ఈమెను ఏరి కోరి ఈ స్పెషల్ సాంగ్‌లో నర్తింపచేశారట. అందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చారట. అది అక్షరాలా 2 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. ఏమో ఇచ్చినా ఇవ్వచ్చు.
జాక్వెలైన్కున్న క్రేజ్ అలాంటిది. ఇక 'బ్యాడ్బోయ్..' వీడియో సాంగ్ ఏ రేంజ్లో ఊపేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాక్వెలైన్ అంద చందాలు, హాట్ హాట్ రొమాంటిక్ స్టెప్పులు, ఘాటైన అమ్మడి ఒంటి విరుపులు, మిగిలిన అందగత్తెల అందాలు ఒక్కటేమిటి ఈ పాటను టాప్ లెవల్లో నిలబెట్టేశాయి. ఆగస్ట్ 30న 'సాహో' వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.