2019 టిక్‌టాక్‌ క్వీన్‌గా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ.!

By Inkmantra - December 21, 2019 - 08:35 AM IST

మరిన్ని వార్తలు

ప్రస్తుతం టిక్‌టాక్‌ యాప్‌ యూత్‌ని ఏ రేంజ్‌లో కితకితలు పెట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మాటకొస్తే, యూత్‌నే కాదు, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారినీ టిక్‌టాక్‌ యాప్‌ ఉర్రూతలూగిస్తోంది. సామాన్యులు రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా అవతరిస్తుంటే, సెలబ్రిటీలు తమకున్న ఫాలోయింగ్‌ని మరింత పెంచుకుంటున్నారు ఈ టిక్‌ టాక్‌ వీడియోల ద్వారా.

jacqueline fernandez on TikTok

Watch the best short videos of jacqueline fernandez(@jacquelinef147). 3.4k people like this. 2.6k Followers. 2 Following. bollywood♥

రీసెంట్‌గా టిక్‌టాక్‌ వీడియోల్లో కనిపించి మెస్మరైజ్‌ చేసిన బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ జాక్వెలీన్‌ ఫెర్నాండేజ్‌కి అరుదైన గౌరవం దక్కింది. 2019 టిక్‌టాక్‌ రివైండ్‌ ప్రచారంలో భాగంగా, మొదటి 50 కంటెంట్‌ వీడియోల జాబితా రిలీజైంది. ఈ జాబితాలో అత్యధిక ఫాలోవర్స్‌తో జాక్వెలీన్‌ మొదటి స్థానం సంపాదించింది. ఈ మధ్య ఈ హాట్‌ బ్యూటీ ప్రబాస్‌ హీరోగా తెరకెక్కిన 'సాహో' సినిమాలో 'బ్యాడ్‌బోయ్‌' సాంగ్‌లో కనిపించి, తన హాట్‌ అప్పియరెన్స్‌తో ఆడియన్స్‌ మనసు దోచేసిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS