హీరో నితిన్ తో పవర్ పేట చిత్రాన్ని నిర్మించనున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ !

మరిన్ని వార్తలు

వెంకీమామ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నితిన్ తో పవర్ పేట అనే చిత్రాన్ని నిర్మించనుంది. కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. 2020 సమ్మర్ నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ', చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో 'చదరంగం', వెంకీ అట్లూరి డైరెక్షన్ లో 'రంగ్ దే'. ఈ చిత్రాల అనంతరం నితిన్ పవర్ పేట షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆడియన్స్ కు ఆసక్తి కలిగించేలా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు కృష్ణ చైతన్య. ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS