మంచు మనోజ్‌ మనసులో మాట ఏంటంటే.!

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు మంచువారబ్బాయ్‌ మంచు మనోజ్‌ ఏం చేసినా విలక్షణంగానే ఉంటుంది. ఆన్‌ స్క్రీన్‌ ఆయన స్టోరీలను ఎంచుకోవడంలోనే కాదు, ఆఫ్‌ స్క్రీన్‌ కూడా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గాను ఉంటాడు మంచు మనోజ్‌. 

తాజాగా మంచు మనోజ్‌ చేసిన ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ ప్రకటనలో ఏముందంటే.. 'కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. ఈ ప్రయాణం కోసం కొన్ని నెలలు హైద్రాబాద్‌కి దూరంగా ఉంటాను. అలా అని సినిమాలకు దూరం కాననీ, సినిమాలను తాను ఎప్పుడూ వదులుకోననీ..' చెప్పాడు. అయితే ఆ కొత్త ప్రయాణం రాజకీయమేనని అందరూ అనుకుంటున్నారు. రైతులూ, వారి పిల్లల కోసం తన వంతుగా సాయం చేస్తానంటున్నాడు. అయితే అది ఏ రూపంలో అనేది తెలీదు. 

రైతుల పిల్లల విద్యా, ఉపాధి కోసం ఆలోచిస్తాడట. సినీ ప్రముఖులకు సేవా కార్యక్రమాలు కొత్తేమీ కాదు. అయితే కొన్నాళ్లపాటు హైద్రాబాద్‌కి దూరంగా ఉంటాను అని మంచు మనోజ్‌ అనడం కొత్త ప్రయత్నమే. అంతేకాదు 'కొత్త ప్రయాణం..' అంటూ మాట్లాడడంతో మనోజ్‌ ఏం చేయబోతున్నాడనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మంచు మనోజ్‌ తండ్రి మోహన్‌బాబు సొంత ప్రాంతం చిత్తూరు జిల్లా. ఇక్కడి నుండే మోహన్‌బాబు మరోసారి రాజకీయ ప్రయాణం మొదలు పెడతాడని అందరూ అనుకుంటున్నారు. 

ఈ తరుణంలో మనోజ్‌ చేసిన ఈ తాజా ప్రకటన సంచలనమైంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS