ఈ హెడ్డింగ్ చూసి, జగపతి బాబు ఇదేదో సినిమా కోసమో లేక సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పైన పేల్చిన డైలాగ్ కాదు ఇది.
తాము నివసిస్తున్న అపార్ట్ మెంట్ బిల్డర్ తమని మోసం చేశాడు అంటూ GHMCకి ఫిర్యాదు చేశాడు. ఆయన అందించిన వివరాల ప్రకారం, జగపతి బాబు నివసించే గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడను అక్రమంగా తొలగించే పక్కనే ఉన్న వేరే అపార్ట్ మెంట్స్ ని కలిపెసేయ్యడం చట్టరీత్యా నేరం అంటూ అధికారులని ఆశ్రయించారు.
జగపతి బాబుతో పాటుగా ఆయన అపార్ట్ మెంట్స్ లో నివసించే వారు అందరు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అలాగే దీనంతటికి కారణమైన ఆ బిల్డర్ పైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.