స్టైలీష్ విలన్ పాత్రలకు జగపతిబాబు పెట్టింది పేరు. యూత్ స్టార్స్ అందరి సినిమాల్లోనూ జగ్గూ భాయ్ విలన్ గా చేసేశాడు. అయితే చిరంజీవి కి మాత్రం తాను విలన్ కాలేదు. `సైరా`లో అలాంటి పాత్ర వచ్చినా - పూర్తి స్థాయి క్యారెక్టర్ కాదు. అయితే ఈసారి మరో మంచి ఛాన్స్ వచ్చింది జగపతిబాబుకి.
లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడు. సుజిత దర్శకత్వం వహిస్తాడు. ఇందులో ఓ పరర్‌ఫుల్, స్టైలీష్ విలన్ పాత్ర ఉంది. దాని కోసం జగపతిబాబుని ఎంచుకున్నార్ట. చిరంజీవి సినిమా అంటే జగపతిబాబు ఎందుకు వదులుకుంటాడు? తను కూడా ఓకే చెప్పేశాడు. చిరు సోదరిగా సుహాసిని, ఖుష్బూలలో ఒకరు నటించే ఛాన్సుంది. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు చిరు. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. `లూసీఫర్` రీమేక్ పట్టాలెక్కబోతోంది.