ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న క్రేజీ సినిమాలలో 'కెజిఎఫ్: చాప్టర్ 2' ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హిట్ ఫిలిం 'కెజిఎఫ్: చాప్టర్ 1' కు రెండవ భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి ఓ హింట్ ఇస్తూ తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టారు.
రెండు ఫోటోలను షేర్ చేసి "ఏం జరుగుతోంది.. మీరు ఊహించండి" అంటూ అభిమానులను ప్రశాంత్ ఊరించారు. ఒక ఫోటోలో యష్, మరో ఫోటోలో ప్రశాంత్ ఏదో వీడియో ఇంటర్వ్యూలో పాల్గొంటున్నట్టుగా ఉంది. మరి ఈ వీడియో చిత్రీకరణ వెనుక ఉద్దేశమేంటి అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ 'కేజీఎఫ్ 2' ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నారా లేదా ఈ సినిమా గురించి మరేదైనా కీలకమైన అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకునేందుకు రెడీ అవుతున్నారా?
అయితే కొందరేమో త్వరలోనే కెజిఎఫ్ పార్ట్ 1 మా టీవీ లో ప్రసారం కానుంది. అందుకే బిహైండ్ ది సీన్స్ వివరిస్తూ వీడియో బైట్స్ ఇచ్చి ఉంటారని గెస్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారం అయితే 'కెజిఎఫ్ 2' ఈ ఏడాది అక్టోబర్ 23 విడుదల కావాల్సి ఉంది.