పుష్పలో బన్నీ ఫ్యామిలీ మ్యాటర్ అలా ఉంటుందా?

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం ఉండే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తాడు. ఇవన్ని మనకు ఇదివరకే తెలిసిన విషయాలు. ఈ సినిమాలో బన్నీ కుటుంబ సభ్యుల గురించి మరికొంత సమాచారం బయటకు వచ్చింది.

 

ఈ సినిమాలో బన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉంటారట. వారిలో ఒకరు గ్రామ సర్పంచ్ గా ఉంటారని, ఈ కథకు కొంత పొలిటికల్ టచ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇద్దరు అన్నయ్యల పాత్ర కథలో కీలకంగా ఉంటాయని, అందుకే ప్రముఖ నటులను ఈ పాత్రలకు ఎంచుకోవాలని సుకుమార్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ పాత్రలకు నటులను ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు.

 

ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అడవుల నేపథ్యంలో జరపాల్సి ఉంటుంది. ఈ కరోనా క్రైసిస్ కొంత సద్దుమణిగిన తర్వాత షూటింగును తిరిగి ప్రారంభించే ఆలోచనలో 'పుష్ప' టీమ్ ఉన్నారట. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS