'బాలకృష్ణుడు'కి జగపతి వాయిస్‌

మరిన్ని వార్తలు

ఫ్యామిలీ హీరోగా అమ్మాయిలకి ఫేవరేట్‌ అండ్‌ రొమాంటిక్‌ హీరో జగపతిబాబు. తర్వాత 'లెజెండ్‌' సినిమాతో తొలిసారిగా విలన్‌ అవతారమెత్తాడు. అలా టాలీవుడ్‌కి జగపతిబాబు రూపంలో ఓ హ్యాండ్సమ్‌ విలన్‌ పరిచయమయ్యాడు. హ్యాండ్సమ్‌ విలన్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన జగపతిబాబు కెరీర్‌కి బ్రేకులే లేకుండా పోయాయి. ఒక్క విలన్‌ క్యారెక్టర్సే కాదు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ దూకుడు పెంచేశాడు.  

ఒక్క తెలుగులోనే కాదు, తమిళ, మలయాళంలో ఎక్కడ చూసినా జగపతిబాబే. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీయెస్ట్‌ ఆర్టిస్ట్‌ అయిపోయాడు. ఇవన్నీ ఇలా ఉండగా, తనకి ఎంతో ప్లస్‌ అయిన వాయిస్‌తో కూడా మెప్పిస్తున్నాడు. పలు చిత్రాలకి జగపతిబాబు వాయిస్‌ అందిస్తున్నారు. ఈ జోరు కేవలం తెలుగు, తమిళం వరకూ కాదు ఆంగ్లం వరకూ చేరింది. హాలీవుడ్‌లో 'ది బిగ్‌ ఫ్రెండ్‌ జెయింట్‌'లో లీడింగ్‌ క్యారెక్టర్‌కి జగపతిబాబు వాయిస్‌ అందించడం విశేషం. కాగా తాజాగా తెలుగులో నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'బాలకృష్ణుడు' సినిమాకి జగపతిబాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారట. సినిమాకి జగపతి వాయిస్‌ ఓవర్‌ చాలా ప్లస్‌ కానుందని అంటున్నారు. పవన్‌ మల్లెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నారా రోహిత్‌ సిక్స్‌ ప్యాక్‌తో స్లిమ్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. పక్కా కమర్షియల్‌ మూవీ ఇది. ఇంతవరకూ విలక్షణ చిత్రాలనే ఎంచుకున్న నారా రోహిత్‌ తొలిసారిగా పక్కా కమర్షియల్‌ మూవీలో నటిస్తున్నాడు 'బాలకృష్ణుడు' ద్వారా. అందాల రెజీనా మరింత అందంగా హాట్‌ హాట్‌గా కనిపిస్తోంది ఈ సినిమాలో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS