తెలుగు, తమిళ భాషల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నా జగపతిబాబు బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్సేనట. ఎందుకు? ఏమో, అది సస్పెన్స్‌గా ఉంచాలనుకుంటున్నాడంటే పెద్ద కథే ఉండాలి. కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన జగపతిబాబు కొత్త ఇన్నింగ్స్‌లో విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తున్నాడు. నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి జగపతి బాబు. చాలా సింపుల్‌సిటీని ఫాలో చేస్తాడు. ఫెయిల్యూర్‌ని కూడా ఒప్పుకోగలిగే సత్తా ఆయనకి మాత్రమే ఉంది. 'ఇటీవలే 'పటేల్ సర్' సినిమాతో చాలా కాలం తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జగపతి బాబు. ఈ సినిమాని డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కిన సినిమాగా ప్రమోషన్ చేశారు. డిఫరెంట్ యాక్షన్ మూవీ అనుకున్నారు అంతా. అయితే పటేల్ సర్' ప్రమోషన్ తేడా కొట్టేసిందని అంటారాయన. కుటుంబ కథా చిత్రంగా ప్రమోషన్ చేసి ఉంటే మంచి విజయం సాధించేదని ఆయన చెబుతున్నారు. విలన్‌గా కొత్త ఇన్నింగ్స్ చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఒక పక్క విలన్‌గా నటిస్తూనే, మరో పక్క హుందా అయిన క్యారెక్టర్స్‌లోనూ నటిస్తున్నారు. కొత్తగా హీరోగా కూడా సినిమా చేశారు ఈ 'పటేల్ సర్'తో. ప్రస్తుతం 'జయ జానకి నాయకా' సినిమాలో నటిస్తున్నారు. 'జయ జానకి నాయక' సినిమాలోని తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. విలన్‌గా, మంచి తండ్రిగా కొత్త కొత్త పాత్రలతో ఆకట్టుకుంటున్న జగపతి, తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటేనే సినిమాలకు ఒప్పుకుంటానని అన్నారు.