బెల్లంకొండ సాయి శ్రీనివాస్-రకుల్ ప్రీత్ జంటగా నటించిన జయ జానకి నాయక చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ ఇప్పుడే పూర్తయింది, సెన్సార్ వారు U/A సర్టిఫికేట్ ఇవ్వగా, ఈ చిత్ర నిడివి 149 నిమిషాలు (2గంటల 19నిమిషాలు) ఉండనుంది. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచగా, జయ జానకి నాయక చిత్ర రిజల్ట్ పై నమ్మకంగా ఉంది.
అయితే ఈ చిత్రానికి మరొక రెండు చిత్రాల (లై & నేనే రాజు నేనే మంత్రి) నుండి రిలీజ్ రోజున తీవ్ర పోటీ ఎదురుకానుంది. ఈ తరుణంలో దర్శకుడు బోయపాటి మాత్రం తమ చిత్రం ప్రేక్షకులని తప్పకుండా ఆకట్టుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు.