'అమ్మ బ్రహ్మదేవుడా..' అనే పాటలోని శ్రీదేవి గుర్తొస్తోంది కదా ఈ ఫోటో చూస్తుంటే. అవును మరి ఆ అతిలోకసుందరి కూతురే కదా ఈ అందాల రాశి. అదేనండీ ఈ ఫోటోలో జాన్వీ కపూర్ లుక్స్ గురించే మాట్లాడుకుంటున్నాం.
'ధడక్' మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వీకపూర్ నటిగా తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. అందంలో కాస్తో కూస్తో తక్కువ మార్కులేయించుకుందనుకుంటే, ఇదిగో ఈ పిక్ చూస్తే అక్కడ తగ్గిన మార్కులేమైనా ఉంటే ఫుల్ల్గా నిర్మొహమాటంగా ఇక్కడ ఇచ్చేయొచ్చు. లుక్స్‌లో బాగా మెచ్యూరిటీ కనిపిస్తోంది జాన్వీలో. హాట్ అప్పీల్ విషయానికి వస్తే, జాన్వీకి అదేమంత తక్కువ కాదు. కానీ సినిమాల్లో ఇంకా ఆ టాలెంట్ ప్రదర్శించే అవకాశం రాలేదు.
ప్రస్తుతం జాన్వీ నటిస్తున్న సినిమాలు కూడా పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే కావడంతో ఇప్పుడప్పుడే జాన్వీకి స్క్రీన్ మీద గ్లామర్ షో చేసే అవకాశం లేదనే చెప్పాలి. అందుకే సోషల్ మీడియాలో అడక్కుండానే ఇదిగో ఇలా అందాలతో హాట్ హాట్‌గా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.