నెటిజన్స్‌కి ఆ హీరోయిన్‌ గట్టి కౌంటరే ఇచ్చిందిగా.!

మరిన్ని వార్తలు

సమీరారెడ్డి హీరోయిన్‌గా ఒకప్పుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో చిరంజీవి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తదితర హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. ఓ బిడ్డకి తల్లయ్యింది. ప్రస్తుతం రెండో సారి ప్రెగ్నెంట్‌ అయ్యింది. ఈ మధ్య సమీరా రెడ్డి బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోలకు నెటిజన్స్‌ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. 

 

ఆమె కలర్‌ గురించీ, ఫిగర్‌ గురించీ ట్రాల్‌ చేస్తున్నారు. 'ప్రెగ్నెన్సీలో నీకా పోజులు అవసరమా..?' అంటూ కొందరు హద్దులు మీరి ట్రాలింగ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై స్పందించింది సమీరారెడ్డి. ఈ సారి ఇంకో అడుగు ముందుకేసి స్విమ్‌ సూట్‌లో బేబీ బంప్‌తో స్విమ్‌ చేస్తూ ఉన్న పిక్స్‌ పోస్ట్‌ చేసి, 'నేను ఓ బిడ్డకి తల్లినయ్యాను. ఇంకో బిడ్డకి తల్లిని కాబోతున్నాను.. నేనెలా ఉండాలో చెప్పడానికి మీరెవరు.?' అంటూ నెటిజన్స్‌కి గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. 

 

అవును నిజమే.. సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉండడం మంచీ, చెడూ తేడా లేకుండా, విత్‌ ఇన్‌ సెకన్స్‌లో ఏ విషయమైనా ఎల్లలు దాటేస్తుండడం వరకూ బాగానే ఉంది. కానీ సెలబ్రిటీల విషయంలో ఇలా హద్దులు మీరి ప్రవర్తించడం బాగా లేదు. సెలబ్రిటీలూ.. వారి లైఫ్‌ స్టైల్‌ అంతా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌. వారున్న సొసైటీకి వారి లైఫ్‌ స్టైల్‌కీ అదేమంత తప్పు కాదు. అన్నింటినీ భూతద్దంలో చూడడం మంచిది కాదు. నెటిజన్లు ఈ విషయాన్ని గమనించి ప్రవర్తిస్తే బావుంటుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS