బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయక చిత్రానికి సంబందించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అయింది.
అదేంటంటే- జయ జానకి నాయక నైజాం ఏరియా రైట్స్ ని ప్రముఖ నిర్మాత పంపిణిదారుడైన దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ రైట్స్ కోసం ఆయన సుమారుగా రూ 9 కోట్లు చెల్లించినట్టు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
అయితే ఇంత మొత్తం పెట్టడం చూస్తుంటే- సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది అనే అభిప్రాయం వస్తున్నది. ఇంకొంతమంది మాత్రం, ఈ చిత్ర ప్రమోషన్ కోసం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అని అంటున్నారు! బెల్లంకొండ శ్రీనివాస్ పాత చిత్రాల బిజినెస్ అనుకున్నంత రేంజ్ లో జరగనందున, ఇంత మొత్తం వెచ్చించే పరిస్థితి ఉండదు అని ట్రేడ్ వర్గాల కధనం.
ఏదేమైనప్పటికీ ఈ చిత్రానికి కావలసినంత హైప్ ఈ వార్త ద్వారా లభించేసింది.