సెలబ్రిటీల పెళ్లంటూ అప్పుడప్పుడూ గాలి వార్తలు పుట్టించడం అదో సరదా నెటిజన్స్‌కి. అలా ఈ మధ్య ముద్దుగుమ్మ రెజీనా నిశ్చితార్ధమనీ, త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే గాలి వార్త ఈ మధ్య తెగ చక్కర్లు కొట్టింది. అయితే, ఈ వార్తలో నిజం లేదంటూ తాజాగా రెజీనా స్పందించింది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే అనీ, ఇప్పట్లో పెళ్లి ప్రయత్నాలు కూడా లేవనీ స్పష్టం చేసింది. ఒకవేళ పెళ్లి చేసుకునే టైమొస్తే, ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని కూడా సెలవిచ్చింది.
అయితే, ఇలాంటి రూమర్స్ వచ్చిన ప్రతీ సెలబ్రిటీ ఇదే రకంగా స్పందిస్తుంటారు. అలాగే రెజీనా కూడా స్పందించింది. గాలి వార్తలన్నింటినీ కొట్టి పారేయడానికి లేదు కానీ, కొన్ని మాత్రం నిప్పు లేనిదే పొగ రాదనే టైపులోనే పుట్టకొస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత నిజం నిదానంగా తెలుస్తుంది.. అన్నట్లుగా ఆ గాలి వార్తలే కన్ఫామ్ అవుతుంటాయి. అయితే, రెజీనా విషయంలో ఈ రూమర్ ఏమవుతుందో కానీ, ప్రస్తుతానికైతే ఈ భామ కొట్టి పడేసింది. అయినా ఇలాంటి వార్తలు తనకు చెడ్డ చికాకని కూడా రెజీనా గుస్సా అయ్యింది.
ప్రస్తుతం రెజీనా తమిళ, హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో ఇటీవలే '7' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఈ సినిమా రెజీనాకి ఎలాంటి లాభం తెచ్చి పెట్టలేదు. త్వరలో 'ఎవరు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.