ప్రత్యక్ష రాజకీయాలల్లో మెల్లమెల్లగా బిజీ అవ్వబోతున్నాడు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికలలోగా సర్వం సిద్దం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. పవన్ జనసేన పార్టీని కూడా కీలకమైన పార్టీగా గుర్తిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం అందించి. ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని కీలకమైన నేతలకు గవర్నర్ నరసింహం తేనీటి విందు ఇవ్వబోతున్నారు. ఈ విందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కీ పిలుపు అందింది. రాజ్ భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు పవన్ హాజరు కావడం ఇదే తొలిసారి.