బోయపాటి దర్శకత్వం వహించిన చిత్రం `జయ జానకి నాయక`. బెల్లం కొండ శ్రీనివాస్, రకుల్ జంటగా నటించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్నే అందుకొంది. ఈ సినిమాకి సంబంధించిన థ్యాంక్స్ మీట్‌ని కృష్ణా జిల్లా హంసలదీవిలో ఏర్పాటు చేయబోతోంది చిత్రబృందం. హంసలదీవిలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని తెరకెక్కించారు. దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ఎపిసోడ్‌కి మంచి స్పందన వస్తోంది. సినిమా మొత్తానికి కళ్లప్పగించి చూడాల్సిన యాక్షన్ సీన్ అది. అందుకే... థ్యాంక్స్ మీట్‌ని అక్కడ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తరవాత హైదరాబాద్‌లోనూ ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తార్ట. రూ.35 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కించుకొంది. మరి వసూళ్ల అంకె.. ఎక్కడ ఆగుతుందో చూడాలి.