RRR రిలీజ్ ఎప్పుడన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అక్టోబరు 13న మా సినిమా వస్తోందని ఊరించి ఊరించి - చివరికి ఊస్సూరు మనిపించింది RRR టీమ్. ఓ దశలో సంక్రాంతి బరిలి నిలిచిందని ప్రచారం జరిగింది. ఆ తరవాత 2022 వేసవికి వస్తుందన్నారు. అయితే... రిలీజ్ డేట్ విషయంలో చిత్రబృందం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇప్పటికీ.. 2022 సంక్రాంతి న రావడానికి RRR శాయశక్తుల ప్రయత్నిస్తోందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
2022 సంక్రాంతికి ఏయే సినిమాలు రాబోతున్నాయి అనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చేసింది చిత్రసీమ. భీమ్లా నాయక్, రాధే శ్యామ్, సర్కారు వారి పాట.. ఇవైతే పక్కా. అయితే ఇప్పుడు RRR కూడా బరిలో నిలవబోతోందని సమాచారం. జనవరి 10 నుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. అంతకంటే ముందే... RRR రావొచ్చని సమాచారం. జనవరి 7, 8, 9 తేదీల్లో ఏదో ఓ తేదీ ఫిక్స్ చేసి, త్వరలోనే అధికారికంగా ప్రకటించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా. తెలుగులో రిలీజ్ డేట్ ఒక్కటే కుదిరితే సరిపోదు. దేశ వ్యాప్తంగా మిగిలిన సినిమాల రాక చూసుకోవాలి. అందుకే రిలీజ్ డేట్ ప్రకటించడం ఆలస్యం అవుతోందని సమాచారం. RRR దాదాపుగా పూర్తయ్యింది. సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల తేదీ ప్రకటించుకున్నాయి. ఆయా సినిమాలకు అభ్యంతరం లేకపోతే... RRR విడుదలకు ఎలాంటి అడ్డుగోడ లేనట్టే. `ముందు మేం డేట్లు ఇచ్చుకున్నాం` అని ఎవరైనా ఆపితే - RRR పునరాలోచనలో పడుతుంది. ఆ తరవాత వచ్చేది వేసవికే.