బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ అంటే, యూత్‌లో పిచ్చ క్రేజ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్తేదు. ముఖ్యంగా ఆమె డ్రస్సింగ్ సెన్స్‌కి యూత్ ఫిదా అయిపోతుంటారు. జాన్వీ జిమ్ డ్రస్ వేసినా, పార్టీ వేర్ ధరించినా, ఆఖరికి నైట్ డ్రస్ వేసినా కూడా అదో సెన్సేషన్. అందుకే కెమెరా కళ్లు ఆమె చుట్టూ వైఫైలా తిరుగుతుంటాయి. ఇక అసలు ముచ్చట ఏంటంటే, డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో (పొట్టి పొట్టి డ్రస్సులు) చాలా సార్లే జాన్వీ అంద చందాలు తిలకించేశాం.
కానీ, బికినీలో జాన్వీని చూడాలన్న ముచ్చట పాపం ఇంకా తీరనే లేదు. అఫ్కోర్స్ బికినీ జాన్వీకి పెద్దగా కౌంట్ కాదు. కానీ, ఇంతవరకూ బికినీలో కనిపించింది లేదు. జాన్వీతో ఈ మధ్య బికినీ ప్రస్థావన వస్తే, ఆ ముచ్చట ఇంకా అప్పుడే కాదు, అందుకు చాలా టైముంది అని మాట దాలేసిందట. చేసినవి తక్కువ సినిమాలే అయినా, బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చేసుకుంది జాన్వీ కపూర్. అలా తనకొచ్చిన స్టార్డమ్తో ప్రస్తుతం హ్యాపీగా ఉన్నానంటోంది జాన్వీకపూర్. ఇక బికినీ వేయాల్సి వస్తే, ఏమాత్రం వెనుకాడనంటోంది.
సిట్యువేషన్ డిమాండ్ చేస్తే, బికినీ వేయడానికి రెడీ అంటోంది. ఇక జాన్వీ ప్రజెంట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, 'గుడ్‌లక్ జెర్రీ' అను చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మరో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ప్రస్తుతం జాన్వీ చేతిలో ఉన్నాయి.