టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మహిళా అసిస్టెంట్ ని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టై, కొన్నాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే బెయిలు పై బయటికి వచ్చారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కారణంగా తనకి వచ్చిన నేషనల్ అవార్డ్ కూడా రద్దు చేశారు. ఇందుకు పలువురు జానీకి సపోర్ట్ చేసి, నేషనల్ అవార్డు ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశారు. జైలు నుంచి బెయిలు పై బయటికి వచ్చిన జానీ మాస్టర్ కొన్నాళ్లుగా మీడియాకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు జానీ మాస్టర్.
మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన జానీ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. జబర్దస్త్ షో కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా తెరకెక్కిన 'కేసీఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన జానీ మాట్లాడుతూ 'త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మధ్య తన జీవితంలో మర్చిపోలేని సంఘటనలు జరిగాయన్నారు జానీ, నన్ను నమ్మిన ప్రతీ ఒక్కరికీ, ఇంట్లో బిడ్డలా ఆశీర్వదించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు జానీ. మీరు పెట్టుకున్న నమ్మకం వేస్ట్ అవదు. అసలు నిజాలు త్వరలోనే బయటికి వస్తాయి' అని తెలిపారు జానీ.
ఇదే వేదిక పై తన భార్య కి కూడా క్షమాపణ చెప్తూ ఆమె చేసిన సపోర్ట్ కి కృతజ్ఞతలు తెలిపారు. భర్త వెనుకాల భార్య ఉంటుంది, ఆమె ఒక పవర్, ఈ మధ్య నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఆ సమయంలో నా భార్య నాకు అండగా నిలిచింది. అన్నీ చూసుకుంది. భార్యలు వెనుక ఉండి భర్తలను సరైన దారిలో నడిపిస్తున్నారు. తల్లిగా, ఫ్రెండ్ గా సపోర్ట్ అందిస్తూ భర్తని మంచి మార్గంలో నడిపిస్తున్నారు. అందుకే భర్తలు విజయాలను సాధిస్తున్నారు. రాకేష్ వెనుక కూడా సుజాత ఉంది అని జానీ మాస్టర్ పేర్కొన్నారు.