పవన్ కి ఇప్పటికీ విధేయుడినే అంటున్న జానీ మాస్టర్

మరిన్ని వార్తలు

స్టార్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి, కండీషనల్ బెయిల్ పై రిలీజ్ అయ్యి బయట ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటికి వచ్చిన జానీ కొన్నాళ్ళు పాటు మీడియాకి దూరంగా ఉన్నా, ఇప్పుడిప్పుడు కొన్ని ఈవెంట్స్ కి ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నారు. జానీ జ్యుడిషయల్ కస్టడీలో ఉన్నప్పుడు నేషనల్ అవార్డు రద్దు చేయమని పలువురు డిమాండ్ చేయటంతో హోల్డ్ లో పెట్టారు. డాన్సర్స్ అసోషియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసారు. ఛాన్స్ లు తగ్గినట్లు ఒక సందర్భంలో జానీ స్వయంగా తెలిపాడు. రీసెంట్ గా జానీకి ఒక ఇంటర్వ్యూలో మీరు కష్టంలో ఉన్నప్పడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసారా అని ప్రశ్న ఎదురయింది.

జానీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమ, పిచ్చి, భక్తి . ఈ క్రమంలోనే జ‌న‌సేన కోసం విస్తృత ప్ర‌చారం చేసాడు. అసలు అసెంబ్లీకి కూడా పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారంగానే మిగిలిపోయింది. జానీ జనసేనకి ప్రచారం చేసి జగన్ ని విమర్శించి నందు వలనే ఇలా టార్గెట్ చేసారని కూడా కొందరి అభిప్రాయం. మొత్తానికి జానీ టార్గెట్ అయ్యి లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవటం, జనసేన కార్యకలాపాలనుంచి తొలగించటం జరిగింది. జానీ మాస్టర్ అరెస్ట్, రిలీజ్ ల గూర్చి, వివాదం గూర్చి ఎక్కడా జనసేన నుంచి కానీ, పవన్ అండ్ మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి కామెంట్స్ వినిపించలేదు.

జానీ మాస్టార్ని వారు సపోర్ట్ చేయలేదు, విమర్శించలేదు. కామ్ గా ఉన్నారు. జానీ  జైలు నుంచి రిలీజ్ అయ్యాక కూడా ప‌వ‌న్‌ని కలవలేదు. దీనితో జనసేనకు జానీ పూర్తిగా దూరం అవుతున్నాడని, శాశ్వత వేటు వేశారని ప్రచారం జరిగింది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు జానీ. నాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నన్ను దూరం పెట్టడం కరక్టే అని, లేదంటే ప్ర‌తిప‌క్షాల విమర్శలకీ  ఆస్కారం ఇచ్చిన‌ట్టు అవుతుందని పవన్ చర్యను సపోర్ట్ చేసారు జానీ. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నాకే మళ్ళీ జనసేనకి దగ్గరవుతానని జానీ తెలిపాడు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి నాపై నమ్మకం, ప్రేమ అలానే  ఉన్నాయి. ఏ మాత్రం తగ్గలేదు. ఇపుడు నేను చేయాల్సింది అల్లా నా నిజాయితీ నిరూపించుకోవ‌డమే అని జానీ తెలిపాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS