ఆ ముగ్గురూ నవ్వుల 'జాతి రత్నాలు'!

మరిన్ని వార్తలు

ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌కే ఇప్పుడు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఆ కోవలో చిన్న హీరోలు, కమెడియన్లు లీడ్‌ రోల్స్‌లో ఎంటర్‌టైనింగ్‌ స్టోరీలకు ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు మన రైటర్లు. తాజాగా ఆ కోవలోనే ఓ చిత్రం రాబోతోంది. పేరు 'జాతి రత్నాలు'. హీరోలెవరో తెలుసా.? నవీన్‌ పోలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి. నవీన్‌ పోలిశెట్టి ఇటీవల 'ఏజెంట్‌ ఆత్రేయ' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

 

రాహుల్‌ రామకృష్ణ కమెడియన్‌గా సుపరిచితుడు. ప్రియదర్శి తనదైన కామెడీతో, యాక్టింగ్‌ స్టైల్‌తో దూసుకెళ్తున్నాడు. ఈ ముగ్గుర్నీ పెట్టి 'మహానటి' దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనుదీప్‌ కె.వి ఈ సినిమాకి దర్శకుడు. లేటెస్ట్‌గా విడుదలైన ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే, ఈ సినిమా ఎంతలా నవ్వించనుందనేది అర్ధమైపోతోంది. ఈ ముగ్గురూ సినిమాలో ఖైదీ పాత్రల్లో కనిపించనున్నారని ఫస్ట్‌లుక్‌ ద్వారా అర్ధమవుతోంది.

 

మన ఈ ఖైదీల నెంబర్లు ఏమంటారా.? 210, 420, 840.. అర్ధమైందా? ఒకరిని మించిన జాతి రత్నం ఇంకొకరన్న మాట. అంటే, కామెడీ కూడా అలాగే అంతకు మించి అనే రేంజ్‌లో ఉంటుందనీ, ఫన్నీ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ ఈ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయడం ద్వారా చెప్పకనే చెప్పేశారు. ఫస్ట్‌లుక్‌లో వాళ్లే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కనిపించారు. ఇక ధియేటర్‌లో మనల్ని ఇంకెంతలా నవ్విస్తారో చూడాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. అంతవరకూ మీ నవ్వులు ఆపుకోవాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS