సినీ జాతరకు రంగం సిద్ధమైంది

మరిన్ని వార్తలు

కొత్త సినిమాల విడుదలకు డిశంబర్‌ అందంగా ముస్తాబైపోతోంది. మామూలుగా డిశంబర్‌లో ఎక్కువగా సినిమాలు విడుదల కావు. డిశంబర్‌లో విడుదల చేసేకన్నా, జనవరిలో సంక్రాంతికి విడుదల చేసుకోవచ్చు కదా అనుకునేవారు. కానీ సంక్రాంతి ఫుల్‌ ప్యాకప్‌. సో డిశంబర్‌లో కొన్ని సినిమాలు విడుదల చేయక తప్పడం లేదు. అంతేకాదు అక్టోబర్‌, నవంబర్‌లలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు కూడా డిశంబర్‌కి వచ్చి చేరడంతో డిశంబర్‌ నెల సినిమాలతో బిజీ అయిపోయింది.

డిశంబర్‌ 1న సాయి ధరమ్‌ తేజ్‌ 'జవాన్‌' సినిమా విడుదల ఉంది. తర్వాత డిశంబర్‌ 22న అఖిల్‌ రీ లాంఛింగ్‌ మూవీ 'హలో' విడుదలవుతుంది. తర్వాత నాని 'ఎంసీఏ' కూడా ఇదే నెల్లోనే రానుంది. ఇవి కాక మధ్యలో చాలా చాలా చిన్న సినిమాలున్నాయి. అలా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలతో డిశంబర్‌ నెల ఫుల్‌ అయిపోయింది. మొత్తానికి డిశంబర్‌ అంతా సినీ ప్రియులకి పండగే అని చెప్పొచ్చు. ఇంత ఎక్కువగా డిశంబర్‌లో సినిమాలు ఇంతకు ముందెన్నడూ విడుదల కాలేదు.

డిశంబర్‌ అంటే నాగార్జునకే సెంటిమెంట్‌. అలా అఖిల్‌ సినిమా డిశంబర్‌కి వచ్చి చేరింది. గతేడాది డిశంబర్‌లో 'ధృవ' సినిమా వచ్చింది. ఇయర్‌ ఎండింగ్‌లో వచ్చి 'ధృవ' మంచి విజయం అందుకుంది. అలా ఈ ఏడాది డిశంబర్‌లో విడుదలవుతోన్న చాలా సినిమాలపై పోజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉన్నాయి. చూడాలి మరి వీటిలో ఎన్ని సినిమాలు విజయం సాధిస్తాయో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS