ఈ ఏడాది అల్లు అర్జున్‌తో 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాతో హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఇప్పుడు తన తాజా చిత్రం కోసం ఓ కొత్త కాన్సెప్ట్‌ని టేకప్ చేశాడట. అదీ ఓ మల్టీ స్టారర్ అని సమాచారమ్. అందులో యంగ్ హీరో నితిన్, మరో యంగ్ హీరో శర్వానంద్ హీరోలుగా నటించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రాలేదు కానీ ప్రచారం జోరుగా సాగుతోంది.
నితిన్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'లై' సినిమాతో ఆకట్టుకున్నాడు. శర్వానంద్ 'మహానుభావుడు' సినిమాతో విజయం అందుకున్నాడు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. అయితే హరీష్ తెరకెక్కించబోయే సినిమా కోసం ఈ ఇద్దరు హీరోలతోనూ హరీష్ శంకర్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారమ్. హరీష్ చెప్పిన కథ పట్ల మన యంగ్ హీరోలిద్దరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఆల్‌మోస్ట్ ఈ ఇద్దరితోనూ మల్టీ స్టారర్ ఓకే అయ్యే సందర్భాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం నితిన్, కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని నితిన్, పవన్ కల్యాణ్, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ కథనందిస్తున్నారు. కాగా 'మహానుభావుడు' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న శర్వానంద్ తన తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ లేదు కానీ, 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌తో ఓ సినిమా చేయనున్నాడనీ సమాచారమ్. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి హరీష్ దర్శకత్వంలో ఈ మల్టీ స్టారర్ ఓకే అయితే ఖచ్చితంగా అది హిట్టే కావచ్చు.