బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'జయ జానకి నాయకా'. ఈ సినిమా రెండో టీజర్ తాజాగా విడుదలైంది. మొదటి టీజర్ సాఫ్ట్‌గా, స్మూత్‌గా కట్ చేస్తే ఈ టీజర్‌ని మాస్‌గా కట్ చేశారు. 'లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతీసారి అన్నీ వదులుకోం, కానీ ప్రేమని వదిలేస్తాం. కానీ నేను వదలను. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి..' అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇంతకు ముందు సినిమాల్లో కన్నా శ్రీనివాస్ ఈ సినిమాలో చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. అలాగే బోయపాటి మార్కు యాక్షన్ ఈ సినిమాలో ఉందని తెలుస్తోంది. టైటిల్ చూస్తే క్లాసిక్‌గా అనిపించినా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ సినిమాకి. తన ప్రేమ ఎంత బలమైనదో, ప్రేమ కోసం ఆ హీరో ఏమేం చేయాలనుకున్నాడో డైరెక్టర్ చెప్పిన తీరు చాలా బాగుంటుందనీ చిత్ర యూనిట్ అంటోంది. ఈ రెండో టీజర్ వచ్చినాక సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అలాగే రకుల్, బెల్లంకొండ జంట ఆకట్టుకుంటోంది. ముద్దుగుమ్మ ప్రగ్యాజైశ్వాల్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. యంగ్ హీరో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెల్లంకొండ సినిమాలన్నీ చాలా రిచ్‌లుక్‌లో కనిపిస్తాయి. అలాగే టీజర్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా చాలా రిచ్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.