జయం రవి డైరెక్టర్‌ - యాక్టర్‌ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు

తమిళ హీరో జయం రవి నటించిన 'తనీ ఒరువన్‌' చిత్రం తెలుగులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా 'ధృవ' టైటిల్‌తో రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందే జయం రవి అంటే ఓ ఐడియా ఉంది తెలుగు ప్రేక్షకులకు. కానీ, చరణ్‌ రీమేక్‌ చేసిన 'తనీఒరువన్‌' సినిమాతో చరణ్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌తో పాటు, జయం రవి యాక్టింగ్‌ స్కిల్స్‌నీ పోల్చుకోవడంతో ఆయన ఇమేజ్‌ కూడా టాలీవుడ్‌లో బాగా పెరిగింది. అంతకు ముందు, ఆ తర్వాత కూడా జయం రవి నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమయ్యాయి అదే మార్కెట్‌తో. అయితే, ఆశించిన స్థాయిలో జయం రవి మార్కెట్‌ సంపాదించాడా.? లేదా.? అనే సంగతి పక్కన పెడితే, తమిళంలో మాత్రం ఆయన ఓ మోస్తరు స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నారు. అయితే, కొత్త విషయమేంటంటే, హీరోగా సత్తా చాటిన జయం రవి, త్వరలో మెగాఫోన్‌ పట్టబోతున్నారట. అయితే, ఆ సినిమాలో జయం రవి నటించడం లేదట. ఓన్లీ డైరెక్షనే చేస్తారట. మరి నటుడు ఎవరో తెలుసా.? ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు. యోగిబాబును హీరోగా పెట్టి, జయం రవి ఓ విలక్షణ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయట. ఈలోగా హీరోగా తాను కమిట్‌ అయిన సినిమాల్ని పూర్తి చేస్తారట జయం రవి.చూడాలి మరి, హీరోగా టాలెంట్‌ చూపించిన జయం రవి, దర్శకుడిగా తానేంటో ఎలా నిరూపించుకుంటాడో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS