చందమామగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించి, విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. తాజగా కాజల్ 'సీత' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24న 'సీత' సోలోగా ధియేటర్స్‌లో సందడి చేయనుంది. చిత్ర యూనిట్ ఈ సినిమాని చాలా ఇన్నోవేటివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. 'సీత'ని బాగా జనాలకి కనెక్ట్ అయ్యేలా చేశారు ప్రోమోలు, పోస్టర్లతో. ఇక పాత్రల పరంగా 'సీత' పేరుకీ, తీరుకీ అస్సలు పొంతనే లేని పాత్ర. మరి మన మోడ్రన్ సీత, 'సీత' సార్ధకనామధేయురాలిగా క్లైమాక్స్‌కైనా కనిపించిందా.? లేదా.? అని తెలియాలంటే 'సీత' సినిమా చూడాల్సిందే. బెల్లంకొండ, కాజల్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకి తేజ దర్శకుడు.
తేజ సినిమాలంటే ఓ రకమైన ఐడియా ఉందింతవరకూ. వాస్తవానికి ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్రను చాలా బలంగా డిజైన్ చేస్తారు. ఎక్కువ సినిమాల్లో హీరో పాత్రను అమాయకంగానే చూపించారు. ఆయనకు ఘన విజయం తెచ్చి పెట్టిన 'జయం'లో పాల బుగ్గల పసివాడైన నితిన్‌ని పరిచయం చేసి, చివరల్లో చిత్రహింసలకు గురి చేస్తాడు. మరి ఈ సినిమాలోనూ బెల్లంకొండను ఇన్నోసెంట్ బోయ్‌లాగానే చూపిస్తున్నాడు. మరి చివర్లో అంతే హింస పెట్టేస్తాడా.? చూడాలి మరి.
మొత్తానికి తేజ సినిమాల్లో ఉండే మార్కు ఈ సినిమాలో కనిపించడం లేదు ఇంతవరకూ విడుదలైన ప్రోమోస్ చూస్తే. ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ కూడా ఆశక్తికరమైన విషయాల్ని బయట పెట్టింది. అమాయకుడే కానీ, హీరో పాత్ర ఈ సినిమాలో చాలా క్రిటికల్ అని కాజల్ చెప్పింది. అసలింతకీ 'సీత' కథేంటో. ఈ 'సీత'లో తేజ మార్కు ఎంత మేర వర్కవుటయ్యిందో తెలియాలంటే 'సీత' ఖచ్చితంగా చూడాల్సిందేనండోయ్.