శివానీకి జీవిత రాజశేఖర్‌ ట్రెయినింగ్‌ సూపర్బ్‌

మరిన్ని వార్తలు

హీరోయిన్‌గా వెండితెరపై వెలిగిపోవాలనుకుంటున్న శివానీ తన ప్రయత్నాల్లో తానుంది. జీవిత - రాజశేఖర్‌ దంపతుల గారాల పట్టి శివానీ, సినీ పరిశ్రమపై సంపూర్ణ అవగాహన పెంచుకుంది. ఫొటో సెషన్‌ ద్వారా సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. అంతే కాకుండా, క్వాన్‌ అనే సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది శివానీ. ఈ ఏజెన్సీ ద్వారానే మోడలింగ్‌, సినీ రంగాల్లో అవకాశాలు వస్తుంటాయి అందులో రిజిస్టర్‌ చేసుకున్నవారికి. అంటే నటనను ప్రొఫెషన్‌గా ఎంచుకుని, అంతే ప్రొఫెషనల్‌గా నటనలో రాణించాలనుకుంటోందన్నమాట శివానీ. జీవిత, రాజశేఖర్‌ ఇద్దరూ నటనతో పాటు విద్యాధికులే. రాజశేఖర్‌ వైద్య రంగంలో పట్టా అందుకున్న వ్యక్తి. ఇప్పటికీ ఆయన తన ప్రాక్టీస్‌ని అప్పుడప్పుడూ కొనసాగిస్తుంటారు వైద్యుడిగా. అలాగే జీవిత కూడా మంచి నటి. మంచి వక్త. నటనలోనే కాకుండా, సామాజిక అంశాలపై ఎంతో అవగాహనతో మాట్లాడగల వాక్‌ చాతుర్యం ఆమెకుంది. ఏదేమైనా జీవిత, రాజశేఖర్‌ తమ కుమార్తెను సినీ రంగంలో ఓ ప్రొఫెషనల్‌గా చూడాలనుకోవడం, అందుకు తగ్గట్టుగానే శివానీ కూడా ఏకాగ్రతతో ముందడుగు వేయడం అభినందనీయం. మొన్నీ మధ్యనే శివానీ ఫోటో షూట్‌ చూసిన వారంతా బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రానా అన్నంత ఆశ్చర్యానికి గురయ్యారు. లేటెస్టుగా ఆమె దిగిన ఫోటోలు కూడా అలాగే అందర్నీ మరోసారి ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. అలాగే త్వరలోనే ఆమె సినీ ఎంట్రీ షురూ కానుందన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి ఈ లేటెస్ట్‌ పిక్స్‌. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS