హాట్ స్టార్ తో ఆర్జీవీ సంచలన ప్రయోగం

మరిన్ని వార్తలు

రామ్ గోపాల్ వర్మ- ఈ పేరు వింటే చాలు ఏదో ఒక సంచలనాన్ని ముందే ఊహించొచ్చు. ఇక ఈయన తాజాగా GOD, SEX & TRUTH అనే ఒక వీడియోని ఈ మధ్యనే యూరోప్ లో చిత్రీకరించాడు.

అయితే ఈ టైటిల్ వింటేనే మరోసారి రాము తనదైన శైలిలో దేవుడి గురించి, శృంగారం అలాగే నిజం అనే ఈ మూడింటిని కలిపి ఒక వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాడు అని. ఇక ఈ వీడియో లో మరొక సంచలనం కాబోతున్న విషయం ఏంటంటే- ఈ వీడియో కోసం ప్రముఖ అడల్ట్ స్టార్ అయిన మియా మల్కొవాని తీసుకోవడమే.

మియాకి అడల్ట్ స్టార్ గా చాలా ఫాలోయింగ్ ఉంది అలాగే సన్నీ లియోన్ తరువాత భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న మరొక అడల్ట్ స్టార్ గా మియా మల్కొవా పేరుపొందనుంది. ఇదిలావుండగా ఈ వీడియో కి సంబందించిన ట్రైలర్ జనవరి 16 ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఇక ఈ విషయాన్ని మియా మల్కోవా తన ట్విట్టర్ ద్వారా తెలపగా తానెప్పుడు సన్నీ లియోన్ తో పనిచేయలేదు అని అయితే మియా తో పనిచేయడం మాత్రం ఎప్పటికి మరిచిపోలేను అని అర్జీవీ రిప్లై ఇచ్చాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS