బాలీవుడ్‌కి వెళ్తున్న నాని సినిమా.

By iQlikMovies - June 25, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

ఇది వ‌ర‌కు బాలీవుడ్ లో ఏ మంచి సినిమా వ‌స్తుందా? దాన్ని రీమేక్ చేసేద్దామా? అని అనుకునేవాళ్లు తెలుగు ద‌ర్శ‌కులు నిర్మాత‌లు. ఇప్పుడు ఆ క‌థ మారింది. బాలీవుడ్ వాళ్లే మ‌న సినిమాల‌వైపు చూస్తున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి అక్క‌డ `క‌బీర్ సింగ్‌` పేరుతో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. అందుకే - తెలుగు క‌థ‌కు మ‌రింత గిరాకీ పెరిగింది. బాలీవుడ్ దృష్టి ఇప్పుడు నాని సినిమాపై ప‌డింది. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `జెర్సీ`. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని క్రికెట్ ఆట‌కు మేళ‌వించిన తీరు తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది.

 

బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌కి ఎగుమ‌తి అవుతోంది. జెర్సీ హిందీ రైట్స్ మంచి రేటుకి అమ్ముడుపోయాయి. బాలీవుడ్‌లో క్రీడా నేప‌థ్యంలో రూపొందిన చిత్రాల‌కు గిరాకీ ఉంటుంది. ఆ కోవ‌లో `జెర్సీ`ని కూడా చూసేస్తార‌ని అక్క‌డి నిర్మాత‌ల న‌మ్మ‌కం. అందుకే ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్తోంది. మ‌రి నాని ప్లేస్‌లో ఏ బాలీవుడ్ హీరో క‌నిపిస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS