సౌత్ సినిమా అంటే బాలీవుడ్ పడి చస్తోంది. మన సినిమాలు అక్కడ డబ్బింగ్ రూపంలో తెగ ఆడేస్తున్నాయి. మన కథల్ని రీమేకులు చేసేస్తున్నారు. అర్జున్ రెడ్డిని రీమేక్ చేస్తే.. అక్కడ మూడొందల కోట్ల సినిమాగా మిగిలింది. అందుకే `జెర్సీని కూడా అక్కడ రీమేక్ చేసేశారు.
అర్జున్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో షాహిద్ కపూర్ ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. అయితే అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తొలి వీకెండ్ లో అంతా కలిపితే 15 కోట్లు కూడా సాధించలేకపోయింది. ఇప్పటి వరకూ ఈ సినిమా వసూళ్లు 20 కోట్లు దాటలేదని టాక్. ఈ సినిమాపై దాదాపు రూ.90 కోట్ల పెట్టుబడి పెట్టారట. డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం కలిపి రూ.40 కోట్లనుకుంటే.. ఈ సినిమాతో నిర్మాతలకు సగానికి సగం.. పోయినట్టే. అన్నట్టు ఈ సినిమాని దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాతో... బాలీవుడ్ లో దిల్ రాజు ఘనంగా ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు. కానీ జెర్సీ ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు కలలన్నీ కల్లలయ్యాయి. మరోవైపు.. తెలగులో మంచి విజయాన్ని అందుకున్న `హిట్` సినిమాని బాలీవుడ్ లో దిల్ రాజునే రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. కానీ ఇప్పటి వరకూ దాని అడ్రస్సే లేదు.