సెలబ్రిటీస్‌నీ, సెలబ్రిటీ కిడ్స్‌నీ బాలీవుడ్ మీడియా చాలా స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటుంది. వాళ్ళెక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు? అనే కోణంలో నిఘా పెట్టడం బాలీవుడ్ మీడియాకి అలవాటే. అలా మీడియా పెట్టిన నిఘాకి జాన్వీకపూర్ అడ్డంగా దొరికేసింది.
పొట్టి డ్రస్‌తో జాన్వీకపూర్ జుహు ఏరియాలో కన్పించేసరికి మీడియా కెమెరాలు క్లిక్‌మనిపించేశాయి. అంతే ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, దురభిమానులు ఊరుకుంటారా? పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్‌తో హోరెత్తించేస్తున్నారు. వీటిల్లో ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. చాలీ చాలని దుస్తులేసుకోవడమేంటి.. అప్పుడే స్టార్‌డమ్ వచ్చేసిందనే అహంకారమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
'శ్రీదేవి కూతురిగా నీ గౌరవాన్ని చెడగొట్టుకోవద్దు' అని ఇంకొందరు ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు. అయితే వాస్తవానికి జాన్వీ కపూర్ ఫొటో సెషన్‌లో పాల్గొనలేదు. బహిరంగంగా ఎక్కడా హడావిడి చేయలేదు. ఆమె ఎక్కడికో వెళుతోంటే, ఫొటోలు తీసేశారంతే. పైన పింక్ టాప్ (టీ షర్ట్) మాత్రమే వుంది. బాటమ్ లేకపోవడమే ఈ వివాదానికి కారణం. బాటమ్ లేకపోవడం కాదు, షార్ట్ బాటమ్ అంతేనని జాన్వీ కపూర్ సన్నిహితులు అంటున్నారట.
సినిమాల్లో ఇలాంటి కాస్ట్యూమ్స్ మామూలే. పాపం జాన్వీ, తనకు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న కామెంట్స్‌ని ఎలా జీర్ణించుకుంటుందో, వీటిపై ఎలా స్పందిస్తుందో!