అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తై జాన్వీకపూర్ మొట్టమొదటిసారి కవర్ పేజ్ పైకి ఎక్కింది. 'వోగ్' మేగ్జైన్ కవర్ పేజీపై హాట్ హాట్ పోజులతో హొయలు పోయింది. త్వరలోనే జాన్వీ కపూర్ నటించిన తొలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
తల్లి చనిపోయిన తర్వాత తొలి సినిమా రిలీజ్ అవుతున్నందుకు ఆనందపడాలా? బాధపడాలా తెలియని పరిస్థితిలో ఉన్నానని ఈ సందర్భంగా జాన్వీ తన మనసులోని బాధను అభిమానులతో పంచుకుంది. 'మా అమ్మ నన్ను హీరోయిన్‌గా చూడాలని చాలా ఆశపడింది. అందుకోసం ఆమె చాలా కష్టపడింది కూడా. కానీ ఆ ఆనందాన్ని ఆమెకు నేనివ్వలేకపోయాను. నా తొలి సినిమా రిలీజ్ అవుతున్న ఈ ఆనందాన్ని నేను ఆనందంగా ఎలా తీసుకోవాలో తెలియడం లేదు..' అంటూ జాన్వీ బాధాతప్త హృదయంతో తల్లిని గుర్తు చేసుకుంది.
మరాఠీలో ఘన విజయం సాధించిన 'సైరత్' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోన్న సినిమాతో జాన్వీ కపూర్ తెరంగేట్రం చేస్తోంది. 'ధడక్' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఇషాన్ ఖత్తర్, జాన్వీకి జోడీగా నటిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంట్రీకి ముందే జాన్వీ కపూర్ ఆడియన్స్‌లో బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. చాలా కాలం నుంచే జాన్వీపై మీడియా ఓ కన్నేసి ఉంచింది. శ్రీదేవి జీవించి ఉన్నప్పుడే జాన్వీకి సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సెన్సేషనల్‌గా వార్తల్లో నిలిచేది.
దురదృష్టవశాత్తూ శ్రీదేవి మరణించడంతో జాన్వీ ఒంటరిదైపోయిన మాట నిజమే. అయితే ఇకపై జాన్వీ హీరోయిన్‌గా తన టాలెంట్‌తో, అందంతో ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుందో, ఎంత దగ్గర చేసుకుంటుందో చూడాలి మరి.