ఫన్నీ రాజాలుగా ప్రముఖ హీరోలు

మరిన్ని వార్తలు

సునీల్ & అల్లరి నరేష్- పేరుకి ఇద్దరు కమెడియన్ హీరోలే అయినా ఈమధ్యకాలంలో సరైన హిట్స్ లేకపోవడంతో తమ కెరీర్ లో డీలా పడిపోయారు. ఇలాంటి తరుణంలో ఈ ఇద్దరు కలిసి ఒకే చిత్రంలో నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే, ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్నారు, ఈ చిత్రానికి ఫన్ రాజా ఫన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోల పక్కన చిత్ర శుక్ల & నందిని రాయ్ లు నటించడానికి సుముఖుత వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే యోచనలో దర్శక-నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఈ చిత్రమైన సునీల్-నరేష్ లకి అత్యవసరమైన హిట్ ఇవ్వాలని కోరుకుందాం..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS