అందాల భామ త్రిషకు తెలుగులో ఆఫర్స్ లేకపోయినా, తమిళంలో మాత్రం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ముద్దుగుమ్మ త్రిష. ఆ తర్వాత నిశ్చితార్ధం జరిగినాక పెళ్లి బ్రేకప్ కావడం, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం, తర్వాత కెరీర్‌లో బిజీ కావడం అన్నీ చక చకా జరిగిపోయాయ్ త్రిష లైఫ్‌లో.
మళ్లీ ఇప్పుడు త్రిష పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ వర్గాల్లో తెగ సందడి చేస్తున్నాయి త్రిష పెళ్లి వార్తలు. ఈ మధ్య ప్యారిస్‌లో త్రిష ఓ రేంజ్‌లో షాపింగ్ చేసిందట. ఆ న్యూస్ రివీల్ కావడంతోనే త్రిష పెళ్లికి రెడీ అవుతోందని కోలీవుడ్ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయినా ఈ మధ్య స్టార్ హీరోయిన్లు ఎక్కడైనా షాపింగ్ నిమిత్తం పొరపాటున కెమెరాకి చిక్కారంటే చాలు, వారికి పెళ్లి వార్త తగిలించేసి, విత్ ఇన్ సెకన్స్‌లో ప్రచారంలో పెట్టేస్తున్నారు.
అయితే ఆ వార్తను సదరు ముద్దుగుమ్మలు వెంటనే ఖండిస్తే ఓకే. లేదంటే, కొన్నిసార్లు అదే నిజమైపోతోంది కూడా. ముద్దుగుమ్మ శ్రియ విషయంలో అది నిజమైంది. మరో అందాల భామ శృతిహాసన్ విషయంలో అబద్ధమైంది. ఏమో ఇప్పుడు త్రిషా విషయంలో ఏం జరుగుతుందో చూడాలిక. త్రిష ఈ మధ్య ఓ బిజినెస్ మేన్‌తో క్లోజ్‌గా ఉంటోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే త్రిషను త్వరలోనే పెళ్లి కూతురుగా చూడొచ్చేమో.!