హాట్‌ 'జిగేల్‌ రాణి'ని చూసేస్తారా?

By iQlikMovies - March 27, 2018 - 16:25 PM IST

మరిన్ని వార్తలు

'రంగస్థలం'లో పూజా హెగ్దే నటించిన స్పెషల్‌ సాంగ్‌ ప్రోమోని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిత్ర యూనిట్‌ విడుదల చేయనుంది. 'మీ కళ్లు జిగేల్‌మనిపించడానికి వస్తున్నాను..' అంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసింది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. ఈ సాంగ్‌ కోసం భారీ స్థాయిలో పూజా హెగ్దే రెమ్యునరేషన్‌ అందుకుంది. 'జిగేల్‌ రాణి..' ఆడియో సాంగ్‌కే రెస్పాన్స్‌ అదిరిపోయింది. 

ఇక వీడియో వదిలితే ఆ రెస్పాన్స్‌ ఏ స్థాయిలో ఉండనుందో. మెగా అభిమానులు ఈ వీడియో సాంగ్‌ ప్రోమో కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట్నుంచీ సినిమాపై అంచనాలున్నాయి. ఆ అంచనాలు ఒక్కో ఆడియో సింగిల్‌ రిలీజవుతుంటే, ఇంతింత, వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్‌ అన్నీ రిలీజ్‌ అయిపోయాయి. మంచి స్పందన అందుకుంటున్నాయి. ఏ పాటకి ఆ పాటే ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ రోజు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ అయిన 'జిగేల్‌ రాణి' వీడియో సాంగ్‌ ప్రోమో రిలీజ్‌ చేయనున్నారు. 

ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ వారి వారి క్యారెక్టర్స్‌పరంగా ఎంతో ప్రత్యేకమైనవి. ఇంతకు ముందెన్నడూ నటించనివి. ఆ తర్వాత కూడా నటించలేనివి. చిట్టిబాబుగా చరణ్‌ భాష, యాస, కట్టు గెటప్‌ మొత్తం మారిపోయాయి. రామలక్ష్మిగా సమంత ఎక్స్‌ప్రెషన్స్‌ కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే గ్లామర్‌ స్టార్‌గా పేరు పొందిన బుల్లితెర హాట్‌ బ్యూటీ అనసూయ 'రంగమ్మత్త' క్యారెక్టర్‌ ప్రత్యేకమైనది. 

ఇక ఆది పినిశెట్టి, జగపతిబాబు పాత్రలు కూడా ప్రత్యేకమైనవే. ఇలా క్యారెక్టర్సే కాదు, సినిమా నిండా ఎన్నో స్పెషాలిటీస్‌ ఉన్నాయి. ఇన్ని స్పెషాలిటీస్‌తో 'రంగస్థలం' ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS