జొన్న విత్తుల‌.. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా!

మరిన్ని వార్తలు

ఏదైనా చిన్న ఘ‌ట‌న జ‌రిగితే చాలు. అందులోంచి కొత్త క‌థ పుట్టించేస్తాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ప్ర‌పంచంలోని వ్య‌క్తులు, సంద‌ర్భాలు, సంక్షోభాలూ వ‌ర్మ సినిమాకి క‌థ‌లుగా మారిపోతాయి. అలాంటిది... వ‌ర్మ‌పైనే సినిమా తీస్తున్నాడో పెద్దాయ‌న‌. ఆయ‌నే జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు. గీత ర‌చ‌యిత‌గా తెలుగునాట పేరు తెచ్చుకున్న జొన్న‌విత్తుల ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టారు. అయితే ఇదంతా వ‌ర్మ‌పై ప్రేమ‌తో కాదు, కోపంతో. ఏదైనా నిర్మొహ‌మాటంగా చెప్పేయ‌డం వ‌ర్మ స్టైల్‌. దాని వ‌ల్ల చాలామంది అభిమానులు ఏర్ప‌డ్డారు.

 

వ‌ర్మ జీవిత విధానం చూసి చాలామంది ముగ్థులైపోయారు. అయితే ఇదంతా జొన్న‌విత్తుల‌కు న‌చ్చ‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్యా చాలాసార్లు వాదోప‌వాదాలు జ‌రిగాయి. ''నీ మీద సినిమా తీస్తానుండు'' అనే వ‌ర‌కూ జొన్న‌విత్తులు వెళ్లిపోయారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. 'ఆర్జీవీ' పేరుతో ఓసినిమా తీస్తున్నారు జొన్న‌విత్తుల దానికి 'రోజూ గిల్లేవాడు' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టేశారు. ఈరోజు టైటిల్ లోగో విడుద‌ల చేశారు. వ‌ర్మ‌గా ఎవ‌రు న‌టిస్తారు? షూటింగ్ ఎప్పుడు ? అనే విష‌యాలు మాత్రం ఆయ‌న చెప్ప‌లేదు. 'మీరు నాపై రాళ్లు విసిరితే.. నేను దాంతో ఇల్లు క‌ట్టేసుకుంటా' అనే ర‌కం వ‌ర్మ‌. ఎవ‌రు ఎలా డీ గ్రేడ్ చేయాల‌ని చూసినా, దాన్ని కూడా త‌న ప‌బ్లిసిటీకి వాడుకోవ‌డంలో ఘ‌నుడు. `ఆర్‌జీవీ`ని వ‌ర్మ ఎలా వాడుకుంటాడో చూడాలి మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS