కరోనా కారణంగా చేస్తున్న డ్యూటీలకు సెలవులిచ్చేసి, చక్కగా అందరూ పెళ్లాం పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మెకానికల్‌గా సాగిపోయే లైఫ్‌కి కరోనాతో కాస్త ఊరట లభించిందని కొందరు భావిస్తున్నారు. ఇంట్లోనే ఉండడాన్ని మొదట్లో కొందరు కష్టంగా భావించినా, తర్వాత అలవాటైపోయింది. ఈ లైఫ్ కూడా కొత్తగానే ఉందంటూ అడ్జస్ట్ అయిపోతున్నారు. అయితే, ఎప్పుడూ తన ఫ్యామిలీకి దగ్గరగా ఉండే మంచు విష్ణు మాత్రం ఇప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తోంది. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ కోసం ఎప్పుడూ ఎక్కువగానే టైమ్ స్పెండ్ చేసే మంచు విష్ణు, ఫిబ్రవరిలో తన బంధువుకి హెల్త్ ప్రాబ్లెమ్ కారణంగా ఫ్యామిలీతో కలిసి అమెరికాకి వెళ్లారు.
అయితే తండ్రి మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఫ్యామిలీని అక్కడే వదిలిపెట్టి ఆయన ఒక్కరే ఇండియాకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఫ్యామిలీ రిటర్న్ అయ్యే సమయంలో కరోనా ఉధృతి ఇండియాలోనూ పెరిగిపోవడం, సడెన్‌గా లాక్‌డౌన్‌కి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో భార్య, పిల్లలు అమెరికాలోనే ఇరుక్కున్నారు. ఇంతవరకూ ఎప్పుడూ ఫ్యామిలీకి దూరంగా లేని మంచు విష్ణు, ఈ విపత్కర కాలంలో ఫ్యామిలీని విడిచి పెట్టి ఉండలేక బాగా ఎమోషన్ అవుతున్నారు. తన ఎమోషన్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలిపారు.