మ‌హేష్‌తో సినిమాపై ఎన్టీఆర్ కామెంట్‌

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు జోరు అందుకున్నాయి. ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్‌లు క‌ల‌సి ఓ సినిమా చేస్తుండ‌డం, దానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌డం క‌చ్చితంగా మ‌ల్టీస్టార‌ర్ రేంజుని పెంచేదే.  

ఇదే జోరుతో మ‌హేష్ బాబు - ఎన్టీఆర్ సినిమా కూడా ప‌ట్టాలెక్క‌బోతోందా? అస‌లు వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది?  ఇదే ప్ర‌శ్న ఎన్టీఆర్‌కి ఎదురైంది. `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` ఈనెల 11న విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా  ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో భాగంగా మ‌హేష్ బాబు తో సినిమా ఎప్పుడ‌న్న ప్ర‌శ్న ఎదురైంది.

''అంద‌రి హీరోల‌తోనూ క‌ల‌సి ప‌నిచేయాల‌ని వుంది. మ‌హేష్‌తో కూడా చేయాల‌ని వుంది. అయితే మ‌మ్మ‌ల్ని క‌లిసి న‌డిపించ‌డం ఒక్క క‌థ‌కే సాధ్యం. ఇద్ద‌రు హీరోల్ని క‌ల‌ప‌గ‌లిగే ద‌మ్ము క‌థ‌కే ఉంది. దాన్ని న‌డిపించ‌గ‌ల స‌మ‌ర్థుడైన ద‌ర్శ‌కుడు దొర‌కాలి. మా ప్ర‌య‌త్న‌మంతా అదే. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేస్తున్నా. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఏం చెబితే అది చేయ‌డానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి క‌థ‌, ఇలాంటి ద‌ర్శ‌కుడు దొరికితే మ‌హేష్‌తో కూడా మ‌ల్టీస్టార‌ర్ చేస్తా'' అని హింట్ ఇచ్చేశాడు ఎన్టీఆర్‌. 

సో.. ఎన్టీఆర్ నుంచి లైన్ క్లియ‌ర్. ఇక మ‌హేష్ స్పంద‌న కోసం ఎదురు చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS